01-01-2026 12:42:05 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఉన్నత విద్యాభ్యాసం కోసం జర్మనీ(Germany) వెళ్లిన జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి ప్రమాదవశాత్తు మరణించాడు. హృతిక్ రెడ్డి నివసిస్తున్న అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం సంభవించగా, ప్రాణ రక్షణ కోసం తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ నుండి కిందకి దూకడంతో తలకు తీవ్ర గాయం కాగా ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించినట్లు సమాచారం. హృతిక్ రెడ్డి మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.