calender_icon.png 1 January, 2026 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈగల్ ఫోర్స్ ప్రత్యేక తనిఖీలు

01-01-2026 02:33:44 PM

హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా ఈగల్ ఫోర్స్(Eagle Force) ప్రత్యేక తనిఖీలు చేశారు. ఎక్సైజ్, పోలీసులతో కలిసి మూడు కమిషనరేట్లలో ఈగల్ ఫోర్స్ దాడులు చేసింది. 15 ఈగల్ ఫోర్స్ బృందాలు, 8 ఎక్సైజ్ బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయని అధికారులు వెల్లడించారు. పబ్ లు, రిసార్ట్ లలో 51 మందికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. తనిఖీల్లో నలుగురికి డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. వాహన తనిఖీల్లో 38 మందికి పరీక్షలు చేయగా ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కూకట్ పల్లి మాల్ లోని డీజే ప్లేయర్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అర్ధరాత్రి టెస్టులు నిర్వహించారు. డీజే ప్లేయర్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. డ్రగ్స్ కొనుగోలుపై పోలీసుల విచారిస్తున్నారు.