శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలి మహిళ మృతి
కోనరావుపేట, ఆగస్టు 26 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న గుమ్మడి లక్ష్మి (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.పాత ఇల్లు కావడంతో గోడలు, పైకప్పు బలహీనంగా ఉండి ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.మృతురాలు నిరుపేద కుటుంబానికి చెందినవారని, ఆమె మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని పేర్కొన్నారు.ఈ ఘటనపై గ్రామ సర్పంచ్, గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు. అలాగే శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






