18 May, 2026 | 3:41 PM

Breaking News

ఒక్క అవకాశం ఇవ్వండి.. తెలంగాణలో ఘనంగా ఒలింపిక్స్ నిర్వహిస్తాం

25-08-2024 01:14 PM

హైదరాబాద్: మాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. తెలంగాణాలో ఘనంగా ఒలింపిక్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్‌ఎండిసి నిర్వహించిన మారథాన్‌లో పాల్గొన్న క్రీడాకారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తెలంగాణ యువతను క్రీడల్లోకి మళ్లించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎత్తిచూపుతూ అథ్లెటిక్స్‌లో రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని నెలకొల్పేందుకు ప్రతిజ్ఞ చేశారు.

గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా మార్చే యోచనలో ఉన్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.  ఒలింపిక్స్‌కు క్రీడాకారులను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించి వచ్చే విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి కోచింగ్‌ను అందజేస్తామని, హైదరాబాద్‌లో ఒలింపిక్ ఈవెంట్‌లను నిర్వహించేందుకు స్టేడియాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ క్రీడలకు దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే తన దార్శనికతను కూడా వ్యక్తం చేశారు.