18 May, 2026 | 2:20 PM

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ అరెస్ట్

25-08-2024 01:27 PM

టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన పావెల్ దురోవ్, అతని మెసేజింగ్ యాప్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడినందుకు బోర్గెట్ విమానాశ్రయంలో పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై దురోవ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సైబర్, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించారన్న  ఆరోపణలుపై 39 ఏళ్ల దురోవ్ అజర్‌బైజాన్ నుండి తన ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్నాడని, ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఫ్రెంచ్ అరెస్ట్ వారెంట్ తో అరెస్ట్ చేసినట్లు స్థానిక వర్గాలు ఆదివారం తెలిపాయి.