20 June, 2026 | 7:30 PM

సీఎం రేవంత్‌రెడ్డి రైతు బాంధవుడు

17-08-2024 12:44 AM
  1. రాహుల్ మాట ఇస్తే రేవంత్ అమలు చేశారు.. 
  2. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి 
  3. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య డిమాండ్ 

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): రైతులకు రుణమాఫీ చేసి సీఎం రేవంత్‌రెడ్డి రైతు బాంధవుడిగా నిలిచిపోయారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. వరంగల్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు ణమాఫీని సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేశారని చెప్పారు. రుణమాఫీతో దేశంలోని రైతులందరూ తెలంగాణ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తో కలిసి ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేసి న ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. సాం కేతిక కారణాలతో రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందవద్దని, త్వరలోనే వారికి కూడా రుణమాఫీ అవుతుందన్నారు.

బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ. 73 వేల కోట్లు కేటాయించి రైతులకు సీఎం పెద్ద పీట వేశారన్నారు.  గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ రైతులను నట్టేట ముంచిందని ఆరోపించారు. రూ. 8 వేల కోట్లను రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టిందని ఆయన మండిపడ్డారు.  మాట మీద నిలబడి హరీశ రావు రాజీనా మా చేస్తారా లేక తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తావా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అహంకారంతో  మహిళలను కించపర్చేలా  మాట్లాడారని, కాంగ్రెస్ పార్టీకి  ఓట్లు వేశారనే అక్కసుతోనే మహిళలపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజాం సర్కార్ మీద తుపాకీ ఎక్కుపెట్టి పోరాడిన చరిత్ర తెలంగాణ మహిళలకు ఉందనే విషయం తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.