20 June, 2026 | 6:10 PM

నాణ్యత లేని సరకులు అంటగడితే చర్యలు

17-08-2024 12:54 AM

రాష్ట్ర మాతా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయ క్రాంతి): అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యత లేని వస్తువులు అంటగట్టాలని చూస్తే కాంట్రాక్టులు రద్దు చేసి కాంట్రాక్టర్లను తప్పిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. ఆ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ, కార్యదర్శి వాకాటి కరుణతో కలిసి హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవా రం సప్లు కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. నాణ్యమైన గుడ్లు, వస్తువులు సరఫరా చేయకలే కపోతే కాంట్రాక్టర్లు ఒప్పందం నుంచి తప్పుకోవచ్చని సూచించారు.

అంగన్‌వాడీ కేంద్రా లకు పేద పిల్లలు వస్తారని, వారికి పోషకాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కోడిగుడ్ల సరఫరాకు కాంట్రాక్ట్ కుదుర్చుకు న్న సప్లయర్లను తాము మార్చలేదని, సప్లయర్లు మంచి గుడ్లను సరఫరా చేస్తే బాగుం టుందన్నారు. లబ్ధిదారులు గుడ్డు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత సత్వరం వాటిని వినియోగించుకునేలా అంగన్‌వాడీ టీచర్లు అవగాహన కల్పించాలని సూచించా రు.

గాలి, వెలుతురు సోకేలా అంగన్‌వాడీ సెంటర్లలో గుడ్లు స్టాక్ చేయాలన్నారు. నాణ్యత లేని వస్తువులు తీసుకోకుండా, పైఅధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ధరలు పెంచాలని, అలాగే గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి అంగన్‌వాడీ సప్లయర్లకు త్వరగా బిల్లు లు చెల్లించాలని సప్లయర్లు కోరగా.. మంత్రి వెంటనే కుదరదని తేల్చిచెప్పారు. 

ఫలించిన మంత్రి సీతక్క కృషి..

ఏజెన్సీలోని మారమూల గూడేలకు పీఎం జన్మన్ పథకం ద్వారా రహదారి సదుపాయం కల్పించాలని మంత్రి సీతక్క ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. కేంద్రం సానుకూలంగా స్పందించింది. తొలి విడతలో 28 ఆవాస గ్రామాలకు 66.97 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించేందుకు ముందుకు వచ్చింది. శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి పరిపాలన పరమైన అనుమతులు వచ్చాయి. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖకు అందాయి.