calender_icon.png 19 January, 2026 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దావోస్‌కు బయల్దేరిన సీఎం రేవంత్

19-01-2026 10:26:17 AM

హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక(World Economic Forum) సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరింది. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అధికారులు దావోస్ కు పయనం అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ లో ఉన్నారు. పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది

దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, లోరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం రేవంత్ విడివిడిగా భేటీ అవుతారు. అలాగే పలు రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. దావోస్ ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. 'తెలంగాణ రైజింగ్-2047'(Telangana Rising 2047 విజన్‌ను, రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.