calender_icon.png 19 January, 2026 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌టీఆర్ విగ్రహానికి భూక్య రమేష్ నాయక్ ఘన నివాళులు

19-01-2026 10:28:15 AM

ఇల్లందు, (విజయక్రాంతి): స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు భూక్య రమేష్ నాయక్ ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు దైవసమానులైన నందమూరి తారక రామారావు గారు సామాజిక న్యాయానికి దారి చూపిన మహానాయకుడని కొనియాడారు. ఆనాడు ఎందరో నిరుద్యోగులకు సింగరేణిలో ఉద్యోగావకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తుచేశారు. చిత్రరంగం, రాజకీయ రంగం రెండింటిలోనూ అపూర్వ విజయాలు సాధించిన ఎన్‌టీఆర్ చూపిన మార్గంలో నడిచి యువత భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని భూక్య రమేష్ నాయక్ పిలుపునిచ్చారు