calender_icon.png 19 January, 2026 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య రంగంలో అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరం

19-01-2026 10:00:37 AM

బిల్డింగ్ బ్రిడ్జెస్ ఇన్ మెడిసిన్" ఉన్నత స్థాయి సమావేశంలో టీ పిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు 

హైదరాబాద్,(విజయక్రాంతి): వైద్య రంగంలో అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమని *బిల్డింగ్ బ్రిడ్జెస్ ఇన్ మెడిసిన్" ఉన్నత స్థాయి సమావేశంలో టీ పిసిసి ప్రధానకార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు.  ఆదివారం హైదరాబాద్ లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్  ఏఎంఏనాయకత్వం మరియు భారతీయ వైద్య సమాజం మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో "బిల్డింగ్ బ్రిడ్జెస్ ఇన్ మెడిసిన్" అనే ఉన్నత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఏఎంఏఅధ్యక్షులు డా. బాబీ ముక్కమాలా, ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ విశిష్ట కార్యక్రమంలో దుద్దిళ్ల శ్రీనుబాబు తో పాటు పలువురు ప్రముఖ వైద్యులు,వైద్య రంగ నిపుణులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి అంతర్జాతీయ సహకారం, ఉమ్మడి నాయకత్వం, వైద్య సమాజాల మధ్య పరస్పర సంబంధాల బలోపేతం ఎంత అవసరమో ఈ సమావేశం స్పష్టం చేసిందని శ్రీను బాబు తెలిపారు. ఈ సందర్భంగా డా. బాబీ ముక్కమాలా మరియు ఇతర బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో ప్రపంచవ్యాప్త మార్పుల కోసం ఇరు దేశాల వైద్యులు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను ఈ కార్యక్రమం ప్రధానంగా చర్చించిందని, ఒక అర్థవంతమైన ఉద్దేశంతో జరిగిన ఈ గ్లోబల్ కొలాబరేషన్ సమావేశంలో పాల్గొనడం ఎంతో గౌరవంగా ఉందని శ్రీను బాబు అన్నారు.