calender_icon.png 23 November, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

28-07-2024 12:23:40 PM

హైదరాబాద్: హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. కొడంగల్ లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా  నియోజకవర్గంలో ప్రతీరోజు 28వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే ఏర్పాటు చేశారు. కొడంగల్ పట్టణంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

హరే రామ-హారేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, సీఎస్ఆర్ ఫండ్స్ తో నిర్వహణ చేశారు. సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే కొడంగల్ లో పైలట్ ప్రాజెక్ట్ ను  సీఎం ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు దీనిపై పూర్తిగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.