23-11-2025 01:14:52 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చిన ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదివారం విధుల్లో చేరారు. ములుగు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన ఆయనను ములుగు ఎస్పీగా బదిలీపై వెళ్తున్న ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని దర్శించుకున్నారు.