calender_icon.png 10 November, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

10-11-2025 10:55:57 AM

హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(Andesri) సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో(Gandhi Hospital) చికిత్స పొందుతూ కన్నుమూశారు. కుటుంబసభ్యులు అందెశ్రీ భౌతికకాయాన్ని గాంధీ ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు. అందెశ్రీ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం  కుటుంబసభ్యులు లాలాపేట జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఉంచారు. అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అందెశ్రీ ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అస్వస్థతకు గురయ్యారు. లాలాగూడలోని తన ఇంట్లో ఆయన కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.  అందెశ్రీ  "మాయమై పోతున్నడమ్మ" అనే రచన ఆయనకు ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు.