ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం
21-06-2024 12:52 PM
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచి స్వరాష్ట్రం కోసం నిరంతరం తపించిన మహోన్నత శిఖరం తుది శ్వాస వరకు రాష్ట్ర సాధన ధ్యేయంగా నిలబడ్డ మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులులు అర్పించారు. జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు నేతలు నివాళులర్పించారు.






