calender_icon.png 16 December, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Vijay Diwas: యుద్ధ వీరులకు సీఎం వందనం

16-12-2025 10:06:04 AM

హైదరాబాద్: విజయ్ దివస్ 1971 యుద్ధం సాధించిన చారిత్రక విజయంలో వీర జవానుల త్యాగాలను దేశంలోని ప్రతి పౌరుడు స్మరించుకోవాల్సిన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) పేర్కొన్నారు. భారత త్రివిధ దళాల అంకితభావం, దేశభక్తి, వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. యుద్ధంలో వీరమరణం పొందిన అమర జవానులను స్మరిస్తూ ముఖ్యమంత్రి వారికి ఘనంగా నివాళులర్పించారు.