14 July, 2026 | 7:22 PM

కాళోజీ నారాయణరావుకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

13-11-2024 01:50 PM

హైదరాబాద్: కాళోజీ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నివాళులర్పించారు. 'అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి... అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి... అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడ‌ని' ప్ర‌క‌టించిన ప్ర‌జా క‌వి కాళోజీ నారాయ‌ణ‌రావు నిత్య స్మ‌ర‌ణీయులని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కాళోజీ నారాయ‌ణ‌రావు వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఢిల్లీలోని అధికారిక నివాసంలో కాళోజీ చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.