14 July, 2026 | 6:50 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

ఔటర్‌పై కారు ప్రమాదం: మహిళ మృతి

13-11-2024 01:39 PM

హైదరాబాద్: అతివేగంతో వాహనాలు నడపడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న వాహనాన్ని కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కారులో దంపతులు సుమన్, రోషిణి, కుమార్తె వైష్ణవి ప్రయాణిస్తున్నారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన రోషిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందింది. గాయపడిన సుమన్, వైష్ణవిని ఘట్ కేసర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటన వారి కుటుంబంలో కన్నీళ్లను మిగుల్చింది.