22 July, 2026 | 6:35 PM

మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో మొక్కలు నాటిన సీఎం రేవంత్ రెడ్డి

29-06-2024 04:57 PM

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గీసుకొండ మండలం శ్యాంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఘనస్వాగతం పలికారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి మొక్కలు నాటారు. అనంతరం టెక్స్ టైల్ నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. 

సీఎం పర్యటనలో భాగంగా హనుమకొండలో మహిళా శక్తి క్యాంటీన్‌ను కూడా ప్రారంభించనున్నారు. అనంతరం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, సీతక్క, పొంగులేటి, దామోదర రాజా నరసింహం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి, ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు, కడియం శ్రీహరి, నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, రేవురి ప్రకాష్ రెడ్డి, మురళి యశాశ్విని, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తదితరులు పాల్గొన్నారు.