22 July, 2026 | 7:13 PM

Breaking News

వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా శ్యామ్‌ రావు ​ఏకగ్రీవం   •   వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •   జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల   •   ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచాలి   •   హుస్నాబాద్‌లో మూడు జిల్లాల అధికారులతో జరిగే ఎల్‌నినో సమీక్ష ఏర్పాట్ల పరిశీలన   •   గురుకులంలో గోరింటాకు సందడి   •  

విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులే చైతన్యం కల్పించాలి

22-07-2026 06:08 PM

సీఐ బాలాజీ వరప్రసాద్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు  షీ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ జెడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు సెల్‌ఫోన్ల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా సీఐ బాలాజీ వరప్రసాద్ మాట్లాడుతూ సెల్‌ఫోన్ వాడకంపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని అన్నారు.

మారం చేస్తున్నారని చిన్న వయసులోనే సెల్‌ఫోన్ చేతికిస్తే అది వారికి వ్యసనంగా మారుతుందని హెచ్చరించారు. సెల్‌ఫోన్‌కు అలవాటు పడి విద్యార్థులు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు.ఆడపిల్లలపై జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై 100 డయల్ ద్వారా లేదా షీ టీమ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ స్వప్న, రజిత,తదితరులు పాల్గొన్నారు.