భద్రాచలం- ఏటూరునాగారం వరకు 4 వరసల హైవేకు ప్రతిపాదనలు
గత ప్రభుత్వం రింగురోడ్డును పక్కకు పెట్టేసింది.
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తున్నందున బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశం పేర్కొన్నారు. విజయవాడ-జగదల్ పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరాం అన్నారు. ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 180 కోట్లు కేటాయించలేక రింగ్ రోడ్డు పక్కకు పెట్టేసిందని మంత్రి ఆరోపించారు. భద్రాచలం పట్టణంలోనూ కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించిందన్నారు. భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు 4 వరసల హైవేకు ప్రతిపాదనలు చేశామని పేర్కొన్నారు. జగ్గయ్య పేట నుంచి వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు 4 వరసల హైవేకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు.






