calender_icon.png 18 January, 2026 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా మంత్రులను బద్నాం చేయొద్దు.. సీఎం వార్నింగ్

18-01-2026 03:20:19 PM

 నా రాజకీయ ప్రయాణం ఖమ్మం నుంచే

ప్రభుత్వంపై అసత్య ప్రచారం

హైదరాబాద్: రాజకీయ ప్రయాణం మొదట ఖమ్మం జిల్లాలో మొదలు పెట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సభలో వెల్లడించారు. 2007-08లో ఖమ్మం జిల్లాలకు వచ్చినట్లు తెలిపారు. మధిరలోని కొన్ని గ్రామాల్లో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు తనకు అండగా నిలబడిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఉచితంగా సన్నబియ్యం పథకం మొదలు పెట్టామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రావాలంటే ఉన్న వాళ్లలో ఎవరో చనిపోవాలనే పరిస్థితి ఉండేదన్నారు. మన ప్రజాపాలనలో లక్షలాది రేషన్ కార్డులను పేదలకు అందించామని చెప్పారు. రేషన్ కార్డులు లేనివారికి రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సన్నబియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీర్చాలనేది కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అన్నారు. తెలంగాణ టీడీపీ ఉండకూడదని కక్ష కట్టిన బీఆర్ఎస్ ను బొందపెట్టాలని రేవంత్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయడమే ఎన్టీఆర్ కు మనం ఇచ్చే నివాళి అన్నారు.

రైతులకు 9 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేని సీఎం కొనియాడారు. ఇప్పుడు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ పేదవాడిపై కుట్ర చేసి.. ఇళ్లు ఇవ్వకుండా చేసిందని ఆరోపించారు. బీఆర్ఎష్ మోచేతి నీళ్లు తాగాలి అన్నట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ల గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక్షంగా, పరోక్షంగా కుంభకోణం జరిగిందని కొన్ని ప్రత్రికలు రాస్తున్నాయని హెచ్చరించారు. సింగరేణి బొగ్గు మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి.

సింగరేణిలో బొగ్గు స్కామ్ అని వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి టెండర్ ను అనుభవం ఉన్నవారికే ఇస్తామని వివరించారు. సింగరేణి టెండర్ విషయంలో అణాపైనా కూడా అవినీతికి ఆస్కారం లేదని వెల్లడించారు. అనవసర ప్రచారం చేస్తూ.. మారీచుడు, శుక్రాచార్యుడు బలపడడానికి అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. మీ మధ్య ఉన్న పంచాయితీల్లోకి మిమ్మల్ని లాగొద్దు.. మా మంత్రులను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దని రేవంత్ హెచ్చరించారు. ఇలాంటి కథనాలు రాసేముందు తమను వివరణ కోరాలని ముఖ్యమంత్రి సూచించారు.