రైతు ఆత్మహత్యపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్చలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు రైతు ప్రభాకర్ డీప్యూటి సీఎం భట్టి విక్రమార్క అనుచరుల ఆగడాలతో తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య పాల్పడాడు.
నేను చనిపోతున్న.. నా ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి తెలియజేయండి అంటూ ఓ రైతు తనకున్న 7 ఎకరాల పొలంలో 4 ఎకరాలను కొంతమంది అక్రమించుకున్నారని ఎమ్మార్వో, ఎస్సై ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి చనిపోయాడు.






