17 July, 2026 | 1:48 AM

తన అరెస్టు, రిమాండ్‌ను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

02-07-2024 04:10 PM

న్యూఢిల్లీ : లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేయడంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు, రిమాండ్ ను సవాలు చేస్తూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై మంగళవారం విచారించిన హైకోర్టు కేజ్రీవాల్ అరెస్టుపై వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ సీబీఐకి నోటీసులు పంపించింది. తదుపరి విచారణను జులై 17వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహర్ జైల్ లో ఉన్నారు.