01-11-2025 12:15:10 AM
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, తదితరులు ఘన స్వాగతం పలికారు.
ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి మంత్రులకు స్వాగతం పలికిన వారిలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. హెలికాప్టర్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు బయలుదేరారు.