01-11-2025 12:16:43 AM
స్వాధీనం చేసుకున్న హైడ్రా
ఘట్‌కేసర్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): పోచారం మున్సిపల్ చౌదరిగూడ డాక్టర్స్ కాలనీలో 4వేల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. కొందరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే 4వేల గజాల పార్కు స్థలం విషయమై కాలనీ అసోసియేషన్ సభ్యులు హై డ్రాకు ఫిర్యాదు చేశారు. రికార్డులు పరిశీలించిన హైడ్రా అధికారులు శుక్రవారం పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూరా ఫి న్సింగ్ వేయించారు. గతంలో ఎవ్వరూ చే యని పనిని హైడ్రా చేసినందుకు కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.