6 July, 2026 | 4:11 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

ప్రపంచం మాయ కాదు!

30-08-2024 12:19 AM

5న డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి

డా. సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పే మాయావాదానికి ఇతర భారత తత్వశాస్త్రజ్ఞులు చెప్పే మాయావాదానికి చాలా తేడా వుంది. తన దృష్టిలో మాయావాదమంటే మిధ్యావాదం కాదు. ప్రపంచం మాయ అంటే ‘ప్రపంచం లేదు’ అని కాదు. ‘ఈ ప్రపంచం అనాది పదార్థం కాదని’ మాత్రమే ఆయన ఉద్దేశ్యం. అయితే, ఈ ప్రపంచం అవాస్తవికమైందనిగానీ, లేనిదనిగానీ, అర్థం చెప్పటానికి వీల్లేదు. ఈ ప్రపంచం వాస్తవికమైందనే ఆయన నిర్ణయం. దాని అస్తిత్వం వారి పూర్ణభావాలలో ఇమిడిఉంది. ఈ ప్రపంచంలో కనపడే, రూపభేదాలకు మూలం పరిపూర్ణ భావంలో వుంది.

అయితే, ఈ ప్రపంచం అవాస్తవికమైందనిగానీ, లేనిదనిగానీ అర్థం చెప్పటానికీ వీల్లేదు. ఈ ప్రపంచం వాస్తవికమైందనే ఆయన నిర్ణయం. దాని అస్తిత్వం వారి పూర్ణభావాలతో ఇమిడి ఉంది. ఈ ప్రపంచంలో కనపడే, రూపభేదాలకు మూలం పరిపూర్ణ భావంలో వుంది. అయితే, ఈ రూపభేదాలు బ్రహ్మ సమగ్రతను గాని, పరిపూర్ణతను గాని కదిలించలేవు. ఈ విధంగా రాధాకృష్ణ పండితులు ప్రాచ్య పాశ్చాత్య దృష్టులను కూడా సమన్వయపరచ గలిగారు.

ఇందువల్లనే భారత తత్వశాస్త్రాన్ని పాశ్చాత్యులు సానుభూతితోను, ఆర్ద్రతతోను చూడగలిగారు. ప్రపంచానికి సరిపోయే ఒక విశిష్ట తత్వశాస్త్రానికి పునాది వెయ్యగలిగారు. వీరు ప్రచారం చేసే ఆత్మతత్వ తాత్విక దృష్టి ప్రకారం, మూలసూత్రాల్లో అన్ని మతాలూ ఒకటే. అన్ని మతాల సారాంశం ఒకటే. ఎందుకంటే, మతమనేది ఒక సిద్ధాంతం కాదు. కొన్ని సూత్రాల సంపుటీకరణం కాదు. 

-  గోపీచంద్ ‘తత్వవేత్తలు’ నుంచి..