వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు(Rains) కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి కురిసిన వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులను రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. రూడ్లపై నీరు, ట్రాఫిక్ అంతరాయం(Traffic disruption) ఉన్న చోట్ల తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సీఎం ప్రజలను హెచ్చరించారు. జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాల అధికారులు సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. అటు లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.
హైదరాబాద్‌లోని షేక్‌పేట, మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ల, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, ఆర్‌సి పురం, శేర్లింగంపల్లి,పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, గాజులరామారం, బాలానగర్, సుచిత్ర, జీడిమెట్లతోపాటు సమీపంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, జయశంకర్, కుమురం భీమ్, మహబూబ్ నగర్, ములుగు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వనపర్తి, వికారాబాద్, వికారాబాద్, వికారాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సెప్టెంబర్ 22 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
హైడ్రా హెల్ప్ లైన్లు: 04029560521, 9000113667,9154170992.




