calender_icon.png 18 September, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాలు, సైబర్ సెక్యూరిటీ పైన అవగాహన

18-09-2025 08:11:07 AM

ఎస్ఐ కె ప్రశాంత్ రెడ్డి

కోనరావుపేట  (విజయక్రాంతి): కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో కోనరావుపేట ఎస్ఐ కె ప్రశాంత్ రెడ్డి పలు అంశాలపైనా అవగాహనా కార్యక్రమం కల్పించినారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రస్తుతం నమోదవుతున్న పలు కేసుల గురించి తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలు వివరించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, వాహనాలకి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి పౌరుని బాద్యత అని వీటిని అతిక్రమిస్తే తమ ప్రణాలకే ముప్పు అని హెచ్చరించారు.

అలాగే ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాల గురించి తెలిపారు. ఈ మధ్య బ్యాంకు అధికారులమని ఆరోగ్య శ్రీ అధికారుమని తెలిపి పలువురు సైబర్ మోసాలకు పాల్పడుతున్న తీరు వివరించారు. పర్సనల్ బ్యాంకు కాత వివరాలు ఓటీపీ తదితర వివరాలు ఎవరితోను పంచుకోవద్దని సూచించారు. అలాగే డయల్ 100 పోలీస్ ఎమర్జెన్సీ సర్వీస్ గురించి వివరించారు. ప్రజల విపత్కర సమయాల్లో డయల్ 100 వినియోగించుకోవాలని, పోలీస్ వ్యవస్థ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. గ్రామం లో ఏవైనా శాంతి భద్రతల సమస్యలు ఉంటె నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఇందులో ఎవరి మధ్య వర్తిత్వం అవసరం లేదని సూచించారు.