21 July, 2026 | 12:14 PM

నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

21-07-2026 12:36 AM

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో రెండు రోజులు పర్యటించనున్నారు. మంగళ, బుధవారం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, ఎడ్యుకేషన్ హబ్ పనుల పరిశీలనతో పాటు ఎస్‌ఐర్‌పైన సీఎం సమీక్ష చేయనున్నారు.

మంగళవారం సాయంత్రం 4 గంటలకు దుద్యాల్ మండలంలోని హకీంపేట గ్రామంలో ఎడ్యుకేషన్ హబ్‌ను పరిశీలించాక, సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గంలోని అన్ని అభివృద్ది పనులపైన అధికారులతో సమీక్ష చేయనున్నారు. రాత్రి కొడంగల్‌లోనే సీఎం బస చేయనున్నా రు. బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు, బీఎల్‌ఏలతో ఎస్‌ఐఆర్‌పైన సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.