23 July, 2026 | 1:49 AM

ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టడం ఖాయం

23-11-2024 11:29 AM

వయనాడ్ లో లోక్ సభ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి మంచి ఆధిక్యం లభిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వయనాడ్ ప్రజలు ఆమెను రికార్డు స్థాయి విజయాన్ని అందిస్తారని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అటు మొదటి నుంచే వయనాడ్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ దూసుకెళ్తుండగా, ఆరంభం నుంచి బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. వయనాడ్‌లో లక్షా 67 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు.