23 July, 2026 | 12:51 AM

మహారాష్ట్ర ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు

23-11-2024 11:20 AM

ముంబై: శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేసి ఎన్డీఏ కూటమి గెలిచిందని మండిపడ్డారు. ఇది ప్రజాతీర్పు కాదు.. అజిత్‌ పవార్‌, షిండేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమకే స్పష్టమైన ఆధిక్యం వచ్చిందన్నారు. ఇప్పుడు ఎలా ఫలితాలు మారతాయని, మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఎంపీ సంజయ్‌రౌత్ పేర్కొన్నారు.  అటు రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీ కూటములే ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో 221 స్థానాల్లో మహాయుతి, 52 చోట్ల మహా వికాస్ అఘాడీ, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. జార్ఖండ్ 53 స్థానాల్లో జేఎంఎం కూటమి, 27 చోట్ల బీజేపీ కూటమి, ఒక అసెంబ్లీ స్థానంలో ఇతరులు లీడ్ లో కానసాగుతున్నారు. మహారాష్ట్రలో గెలుపు దిశగా బీజేపీ కూటమి దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రదాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.