6 April, 2026 | 9:44 PM

సీఎం పర్యటన విజయవంతం

06-04-2026 08:04 PM

భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బాసర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అందరి సహకారంతో విజయవంతమైందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యట సందర్భంగా జిల్లా అధికారులు బాసరలో అన్ని ఏర్పాట్లు చూశారని తెలిపారు. బాసర ఆలయ చరిత్రలో 225 కోట్లతో చేపట్టి ఈ అభివృద్ధి పనులు మైలురాయి వంటిదని తెలిపారు.