ఉప్పల్ భగాయత్‌లో సీఎం పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
07-06-2026 07:00 PM
హైదరాబాద్: ఉప్పల్ భగాయత్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.1,474 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి, ఏఓసీ సెంటర్ చుట్లూ రూ.960 కోట్లతో నిర్మించే రోడ్డు నిర్మాణానికి, ఉప్పల్ లో వంద పడకల ఏరియా అసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే క్యూర్-1 మొబైల్ యాప్ ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ క్యూర్ యాప్ ద్వారా ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు చెల్లించే అవకాశం ఉందన్నారు.






