calender_icon.png 14 July, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం రేవంత్

07-08-2024 11:22:54 AM

హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేతలు అందరికీ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. నాటి స్వాతంత్య్ర సంగ్రామంలో ఒక సాధనమైన చేనేత.. నేటి తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రధానంగా నిలిచిందని, చేనేతకు పునరుజ్జీవనం కల్పించడాన్ని ప్రజా ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఒక సందేశంలో తెలిపారు. మహిళా శక్తి గ్రూపులు, ప్రభుత్వ శాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం పేర్కొన్నారు.