07-08-2024 11:47:54 AM
భద్రాచలం: అన్నదాన సత్రం, వెస్టా కాంప్లెక్స్ లో వరద నీరు చేరడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. నీటిపారుదల శాఖ అధికారులపై తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద చేరిన వెంటనే మోటర్లు ఎందుకు ఆన్ చేయలేదంటూ తుమ్మల మండిపడ్డారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కుసుమ హరినాధబాబా ఆలయం కల్యాణమండలంపై ఆరా తీశారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గుట్టపై ఉన్న హరినాధబాబా ఆలయం వద్ద కల్యాణమండపం కుంగింది. కల్యాణమండపం కింద కొండను తవ్వడం వల్ల మండలం కుంగింది. భారీ వర్షాల వల్ల కల్యాణ మండపం కిందకు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. గుట్ట కింద ఉన్న ఇళ్లు, దుకాణాల్లోని ప్రజలను ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.