calender_icon.png 5 November, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మీకి సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి

03-11-2025 03:10:28 AM

  1. నీచమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
  2. డబ్బు సంచులతో దొరికిన రేవంత్‌రెడ్డికి రౌడీ షీటర్లంటేనే గౌరవం
  3. ఎక్స్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : భారత ఆర్మీకి సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. భారత సైన్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. భారత ఆర్మీ పైన రేవంత్‌రెడ్డి చేసిన నీచమైన వ్యాఖలను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకోవడంపైనా మండిపడ్డారు. సైన్యంలో చేరి, తమ ప్రాణాలను ఫణంగా పెట్టడానికి అపారమైన కృషి, అంకితభావం, నిబద్ధత, దేశంపై ప్రేమ అవ సరమని స్పష్టం చేశారు.

యూనిఫామ్ ధరించిన మన సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితులలో సరిహద్దులో కష్టపడుతున్నారు కాబట్టే, మనం సురక్షితంగా ఉంటూ, రాజకీయాలు చేసుకోగలుగుతున్నామని వెల్లడించారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసం భారత సైన్యాన్ని అవమానించడం ఆయనకు సరికాదని హితవు పలికారు. ఇప్పటికే తన కామెంట్స్‌తో నీచమైన స్థాయికి చేరిన రేవంత్‌రెడ్డి, ఎన్నికల లబ్ధి కోసం ఆర్మీపై కామెంట్స్ చేసి మరింతగా తన స్థాయి దిగజార్చుకున్నారని తెలిపారు.

భారత సైన్యాన్ని కించపరిచి, పాకిస్తాన్‌ను ఏ ఉద్దేశంతో పొగుడుతున్నారని ప్రశ్నించారు. ‘డబ్బు సంచుల తో దొరికిన రేవంత్ రెడ్డికి గుండాలు, రౌడీషీటర్లు అంటేనే గౌరవం. అలాంటి రేవంత్ రెడ్డి శత్రుదేశాన్ని గౌరవించడం ఆశ్చర్యమేమీ లేదు’ అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డి ఆపాలని, తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నందుకైనా మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.