calender_icon.png 5 November, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జాబ్ మేళా

03-11-2025 03:12:20 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): ఎస్పీడీ నవీన్ నికోలస్ నేతృత్వంలో సమగ్ర శిక్ష వృత్తి విద్య విభా గం ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా ఉప్పల్ కలా న్ జడ్పీహెచ్‌ఎస్‌లో ఎన్‌ఎస్‌క్యూఎఫ్ వృత్తి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించారు. 2015-16 విద్యా సంవత్సరంనుంచి వృత్తి విద్య తెలంగాణ రాష్ట్రంలో ని 898 ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా అమలవుతూ, విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించే విధం గా వివి ధ ట్రేడ్లు, నైపుణ్య ఆధారిత కోర్సులను అందిస్తోంది. ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వృత్తి ట్రేడ్లలో శిక్షణ పొందిన 1,200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 35 ప్రసిద్ధ కంపెనీలు ఉద్యోగ అవకాశాలను అందించాయి. వీరిలో 250 మందికి పైగా విద్యార్థులు వివిధ సంస్థలలో ఎంపికయ్యా రు. అందులో  నెలకు కనీసం రూ.15 వేల నుంచి రూ.27 వేల వేతనంతో ఉద్యోగ ఆఫర్లను పొందారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ పీడీ రాధారెడ్డి, జేడీ వెంకటనర్సమ్మ, వృత్తి విద్య రాష్ట్ర సమన్వయకర్త నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థులతో, ఎంప్లాయర్లతో మాట్లాడి, సమగ్ర ఏర్పాట్లను పరిశీలించారు.

ఎంపికైన విద్యార్థులకు ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ మేళాలో ప్రము ఖ సంస్థలు నెక్స్‌టా, జియో, జెప్టో, టాటా వెస్ట్‌సైడ్, యూస్టా రిలియన్స్, విజన్ ఇండి యా, టాటా స్ట్రువ్, కేఎఫ్‌సీ, క్రీమ్‌స్టోన్, రామోజీ ఫిలింసిటీ, హోటల్ పర్నిక, మెడ్‌ప్లస్, జస్ట్ డయల్, డీజీ టైడ్ సంస్థలు ఉన్నాయి. జాబ్ మేళా విజయవంతం కావడానికి ఆర్జేడీ, డీఈవో, ఏఎంవో, ఎంఈవో ఇతర అధికారులు కీలక పాత్ర పోషించారు. జడ్పీహెచ్‌ఎస్ ప్రిన్సిపాల్ శిరీష, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.