calender_icon.png 5 November, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత, నిందితుల రిమాండ్

03-11-2025 03:10:26 AM

బోయినపల్లి: నవంబర్ 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ కుర్మ సంఘము భవనం వద్ద వద్ద ఆదివారం TS-02-UA-5496 టిప్పర్ లో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నకరీంనగర్ జిల్లా కి చెందిన టిప్పర్ డ్రైవర్ ను, అట్టి ఇసుక ట్రాక్టర్ రవాణా ను చేయమని చెప్పిన టిప్పర్ ఓనర్ ల పై చట్ట ప్రకారం ప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ కి పంపినట్లు ఎస్ ఐ రమాకాంత్ తెలిపారు.

డ్రైవర్ దూరశేటి( 28 ) టిప్పర్ యజమాని అవుదారి రవీందర్ (47) లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి పంపినట్లు ఆయన తెలిపారు.అలాగే ఇంకా ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేసినట్లయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోయినపల్లి ఎస్ ఐ రమాకాంత్‌తెలిపారు.