14-12-2024 01:09:45 AM
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ప్రభుత్వం నిజంగా అరెస్టులు చేయా లనుకుంటే ముందుగా సీఎం రేవంత్ సోదరులను అరెస్టు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. జాతీయ అవార్డు గ్రహీత, సినీనటుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం దారుణమన్నారు. శుక్రవారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందిస్తూ.. ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతిచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు.
తొక్కిసలా టలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడానికి రాష్ర్ట పాలకులే కారణమని.. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సోదరుల వేధింపుల వల్లే చనిపోతున్నానని వారి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుం టే.. వారిని ఎం దుకు అరెస్టు చేయరని ప్రశ్నించారు.
రేషన్‌కార్డు నిబంధనల తో, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లెటర్ రాసి సురేందర్ రెడ్డి అనే రైతు మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సూసైడ్ చేసుకుంటే కారకుడైన రేవంత్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరని నిలదీశారు. రైతులను బలిగొన్నందుకు.. ఫుడ్ పాయిజన్‌తో 49 మంది విద్యార్థులు చనిపోయినందుకు ఎవరిని అరెస్టు చేయాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాకూడదన్నారు.