calender_icon.png 15 May, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ బాధిత కుటుబానికి సీఎం అండ

15-05-2025 01:25:52 AM

చికిత్సకు రూ.12 లక్షల అందజేత 

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): క్యాన్సర్ బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండగా నిలిచారు. బ్లడ్ క్యాన్సర్ బారినపడిన సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచరణ్ చికిత్సకు రూ.12 లక్షలు అందజేశారు. సాయిచరణ్‌కు భార్య లక్ష్మిప్రసన్న, కుమార్తెలు లక్ష్మి సుసజ్ఞ, స్మయతో పాటు తల్లితండ్రులు రాము, సునీత ఉన్నారు.

ఇంటికి ఆధారమైన సాయిచరణ్ క్యాన్సర్ బారినపడటంతో అతడి చికిత్సకు కుటుంబ సభ్యులు సిద్దిపేట మండలం ఎన్సాన్‌పల్లిలో ఉన్న తమ ఇంటిని విక్రయించారు. అయినప్పటికీ చికిత్సకు డబ్బులు సరిపోకపోవటంతో.. వారు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమ ఆర్థిక ఇబ్బందులను విన్నవించుకున్నారు.

చలించిన సీఎం రేవంత్‌రెడ్డి, సాయిచరణ్ చికిత్సకు రూ.5 లక్ష లు మంజూరు చేశారు. దాంతో హైదరాబాద్‌లోని బసవతారాకం క్యాన్సర్ ఆసుపత్రిలో సాయిచరణ్‌కు స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తయింది. చికిత్సకు అదనంగా వ్యయమైన మరో రూ.7 లక్షలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అందించాలని సీఎం ఆదేశించటంతో అధికారులు ఆ మొత్తాన్ని అందజేశారు.

చికిత్స చేయించుకున్న సాయిచరణ్ కుటుంబసభ్యులతో కలిసి బుధవారం సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని సీఎం సాయిచరణ్‌కు సూచించారు.