రాజా ముత్తుపాండీకి సీఎం విజయ్ భారీ నజరానా
28-07-2026 12:54 AM
చెన్నై, జూలై 27 : కామన్‌వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం గెలిచిన రాజా ముత్తుపాండీకి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. 65 కిలోల విభాగంలో పోటీపడిన ముత్తుపాండీ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ కైవ సం చేసుకున్నాడు. యావత్ దేశం గర్వించేలా చేసిన తమ రాష్ట్ర క్రీడాకారుడిపై సీఎం విజయ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అత ను సాధించిన అద్భుత విజయానికి గుర్తింపుగా రూ.30 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఆయన విజయం తమి ళనా డుకు, దేశానికి గర్వకారణమన్నా రు. యువతకు అతని గెలుపు స్ఫూర్తి కావాలని ఆకాం క్షించారు. స్నాచ్‌లో మొదటి ప్ర యత్నంలో విఫలమైనా , తర్వాత 126 కిలో లు ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో రెండో ప్ర యత్నం 160 కిలోలు ఎత్తి రజతం సాధించాడు.






