కానిస్టేబుల్ సస్పెన్షన్
- ఏకే-47తో విద్యార్థులపై కాల్పులు..
- బీహార్ పోలీసు శాఖ నిర్ణయం
పాట్నా, జూలై 27: విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ అభిషేక్‌పటేల్‌పై వేటు పడింది. సోమవారం సదరు కానిస్టేబుల్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ.. శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. ఈ మేరకు శివాన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పూరన్ కుమార్ ఝా ఆదేశాలు జారీచేశారు. ఈనెల 25న బీ హార్‌లో నీట్ లీకుల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనా మా చేయాలని, సీజేపీకి మద్దతుగా విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘బిహార్ బంద్’ తీవ్ర ఘ ర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
శివాన్ జిల్లాలో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఓ కానిస్టేబుల్ ఏకే47తో కాల్పులకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియా లో వైరల్ అయ్యాయి. ఈ కాల్పులకు పాల్పడింది అభిషేక్‌పటేల్‌గా గుర్తించిన రాష్ట్ర పోలీ సు ప్రధాన కార్యాలయం నివేదిక కోరింది. ప్రాథమిక విచారణ అనంతరం సంబంధిత కానిస్టేబుల్ అభిషేక్‌పటేల్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
శివాన్ నగర పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకా రం.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం వి ధు ల్లో ఉన్న కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ పటే ల్ నియంత్రిత పద్ధతిలో ఏకే47తో నా లుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణతోపాటు ఇతర అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.






