సీఎంకు సమస్యల స్వాగతం
- నేడు భద్రాద్రి జిల్లాకు రేవంత్‌రెడ్డిరాక
- చండ్రుగొండలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు
- జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): పారిశ్రామిక ప్రాంతంగా విరా జిల్లిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేడు ప్రగతిని కోల్పోతోంది. గత పాలకుల నిర్లక్ష్యం కా రణంగా నాడు పారిశ్రామిక ప్రాంతమైన జిల్లా అంధకారంలోకి నెట్టివేయబడుతోంది. జిల్లాలో అన్ని వనరులు ఉన్నా పరిశ్రమలు రాక నిర్వీర్యం అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశానికి ఆదర్శంగా ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్స్టేషన్ (కేటీపీఎస్) నేడు అగమ్య గోచరంగా మారింది.
కాలం చెల్లిందనే కారణంగా వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి కేటీపీఎస్ పాత ప్లాంటు లోని ౮ యూనిట్లను నేలమట్టం చేసింది. ఆ ప్రాం తంలో 800 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యం గల కొత్త పవర్ ప్లాంట్కు అన్ని వనరులున్నా గత పాలకుల పక్షపాత వైఖరి కారణంగా మంజూరు చేయలేదు. తక్షణమే కేటీపీఎస్ లో 800 మెగావాట్ల సామర్థ్యం విద్యుత్ ప్లాంట్ ను నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల జరిగేనా?
జిల్లాలో ఏకైక జనరల్ నియోజకవర్గం కొత్తగూడెంలో పాల్వంచ, కొత్తగూడెం రెం డు జంట పట్టణాలుగా పేరుంది. రెండు ము న్సిపాలిటీలు ఉన్నా గత 25 ఏళ్లుగా ఏజెన్సీ వివాదంతో పాల్వంచ మున్సిపాలిటీ ఎన్నికలకు దూరమైంది. ప్రత్యేక అధికారుల పాలనలో చాలీచాలని అభివృద్ధితో ప్రజలు సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. ప్రతిసారి సాధారణ ఎన్నికల సమయంలో పాల్వంచ మున్సిపాలిటీ అంశం ఎన్నికల ప్రచారాస్త్రంగా రాజకీయ పార్టీలు ఉపయోగించారు తప్ప ఎన్నికల నిర్వహణకు చిత్తశు ద్ధి ప్రదర్శించలేదు.
తాజాగా పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ మండలాల్లోని ౭ పం చాయితీలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొత్తగూడెం కార్పొరేషన్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలోకి చేరడంతో పాల్వం చ మున్సిపాలిటీతోపాటు కొత్తగూడెం ము న్సిపాలిటీకి కూడా ఎన్నికల దూరమయ్యే పరిస్థితి నెలకొని ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్కు ఎన్నికలు ప్రశ్నార్థకమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రభుత్వ, దేవాదాయ భూములు అన్యాక్రాంతం
పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ, దేవాదా య భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. పట్టణ పరిధిలోని 444, 817, 999, 727 తదితర సర్వే నంబర్లలో ప్రభు త్వ, పట్టా భూములు మిళితమై ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఈ సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసినా, రియల్ మాఫియా సమీప పట్టా భూముల సర్వే నంబర్లతో ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నది. రికార్డు పరంగా ప్రభుత్వ భూములు వందల ఎకరాల్లో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అక్రమ భవనాలు, వెంచర్లు దర్శనమిస్తున్నాయి.
ఎన్‌ఎండీసీ కర్మాగారంను తిరిగి ప్రారంభించాలి
దక్షిణాసియాలోనే పేరొందిన స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కర్మాగారం ప్రస్తు తం ఎన్‌ఎండీసీలో విలీనమై మూతపడి ఉంది. విలీనం సమయంలో ఎన్‌ఎండీసీ యాజమాన్యం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని వి స్మరించింది. దీంతో వందల ఎకరాల భూ మి, వనరులున్నా కర్మాగారం లేక యువత ఉపాధికి నోచుకోవడం లేదు. ఎన్‌ఎండీసీ కర్మాగారాన్ని అభివృద్ధి చేసే దిశలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వెంగళరావు సాగర్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి
చండ్రుగొండ మండలం సీతయ్యగూడెం సమీపంలో ఉన్న వెంగళరావుసాగర్ ప్రాజె క్ట్ను అభివృద్ధి చేయాలి. సుమారు 2,200 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు 1965లో ఏర్పాటుచేశారు. 2020లో అధిక వర్షాలకు అలుగు కొట్టుకొని పోవడం ద్వా రా ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. రూ.33 కోట్ల అభివృద్ధికి నిధులు మంజూరైన పనులు ప్రారం భంకాక సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. తక్షణమే వెంగళరావుసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి పనులు చేపట్టాలి.
ఉమ్మడి జిల్లాలో హైడ్రా సేవలు కావాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెరువులు నాలాలు ఆక్రమణ గురై బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఏటా వానకాలంలో వరదలు సంభవించి ప్రజలు తీవ్రం గా నష్టపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారుతున్నాయి. ఉమ్మడి ఖ మ్మం జిల్లాలోనూ హైడ్రా సేవలను తీసుకొ చ్చి, ఆక్రమణకు గురైన చెరువులు నాలాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది.
తె లంగాణ ఏర్పాటు నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. మూడు సాధారణ ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కట్టారు. అలాంటి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ప్రజాపాలనగా పేరొందిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పథంలో నడపాలని, పరిశ్రమల ఏర్పాటు చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కోరుతున్నారు.






