28 March, 2026 | 7:27 PM

బలరాం నాయక్ తల్లి మృతి పట్ల సీఎం సంతాపం

05-05-2024 01:25 AM

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ తల్లి లక్ష్మీబాయి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన లక్ష్మీబాయి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా సంతాపం వ్యక్తం చేశారు.