మోదీని బలమైన శక్తిగా చేయాలి
బీబీ పాటిల్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలి
సంగారెడ్డి బీజేపీ ముఖ్యనేతలతో భేటీలో తమిళిసై
సంగారెడ్డి/మెదక్, మే 4 (విజయక్రాంతి): ప్రతి బీజేపీ కార్యకర్త పార్లమెంట్ ఎన్నికల్లో కష్టాపడి పనిచేసి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని, మోదీని బలమైన శక్తిగా చేయాలని మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన జహీరాబాద్ లోక్‌సభ ముఖ్యకార్యకర్తల సమావేశంలో, విశేష్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా మెదక్‌లో ఏర్పాటు చేసిన మేధావుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి, పార్టీని బలోపేతానికి కృషి చేయలని సూచించారు.మెదక్ అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.




