28 March, 2026 | 9:09 PM

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

28-03-2026 07:09 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి  పరీక్ష వ్రాస్తున్న విద్యార్ధుల హాజరు శాతం, సౌకర్యాలపై విద్యా శాఖ అధికారి రాజు ను అడిగి తెలుసుకొని, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను పరిశీలించారు.     విద్యార్ధుల ఆరోగ్య, భద్రత దృష్ట్యా, వైద్య సిబ్బంది, అవసరమైన  మెడిషన్ ను అందుబాటులో ఉంచాలని తెలిపారు.  కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.