28 March, 2026 | 9:08 PM

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

28-03-2026 07:15 PM

ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం,(విజయక్రాంతి): తేనెటీగల పెంపకంపై శిక్షణ తీసుకున్న యువతీ యువకులు మార్కెట్ సౌకర్యం కల్పించుకొని జీవనోపాధి కల్పించుకొని, ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ యువతి యువకులకు సూచించారు. శనివారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో హనీ బీ (తేనెటీగల) పెంపకం ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ ముగింపు సందర్భంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో గిరిజనులు సేకరించే తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా శిక్షణ తీసుకున్న యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని తేనెను సేకరించి మార్కెట్ సౌకర్యం కల్పించుకొని జీవనోపాధి పెంపొందించుకోవాలని అన్నారు.

ఐదు రోజుల తీసుకున్న శిక్షణలో శిక్షకులు అందించిన మెలకువలు ముఖ్యంగా తేనెటీగల ప్రాముఖ్యత, తేనె ఉత్పత్తి, వ్యాపారం చేసుకునే విధానం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకోవడం, వాట్సాప్ మరియు ఆన్లైన్ ద్వారా అమ్ముకునే విధానం, తేనెను సేకరించడానికి కాలనీలా నిర్వహణ, సీజన్కు అనుగుణంగా తీసుకునే జాగ్రత్తలు, తేనె సేకరణ విధానము, బి బాక్సులను ఎలా నిర్వహించాలో అలాగే తేనె తీగల కాలనీలను ఏ విధంగా పరిశీలించాలో క్షుణ్ణంగా తెలుసుకున్నందున వెంటనే ఆచరణలో పెట్టి తేనె తీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందాలని అన్నారు. అనంతరం శిక్షణ తీసుకున్న యువతీ యువకులకు శిక్షణ పూర్తయిన సర్టిఫికెట్లు, హనీ బీ బాక్సులను అందించారు.