calender_icon.png 14 October, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేద ప్రజలకు వరం

13-11-2024 06:17:40 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం మండలాలకు సంబంధించిన 60 మంది బాధిత కుటుంబాలకు 24,32,000/- రూపాయల విలువగల సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిన చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కావాలని ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణ చేయడం తగదని అన్నారు. రానున్న రోజుల్లో నియోజవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు రానున్నట్లు తెలుపుతూ, సమగ్ర సర్వేను విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఆయన వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.