calender_icon.png 19 January, 2026 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కేంద్రంలోని చైన్ స్నాచర్ కలకలం

19-01-2026 12:21:17 PM

వివాహిత మెడలో నుంచి 3తులాల బంగారు గొలుసు లాక్కెళ్ళిన దుండగులు

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): కేంద్రంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును   లాక్కెళ్ళిన ఘటన సంచలనం సృష్టించింది. కులార్కర్ శంకర్ నివాసంలో అద్దెకు ఉంటున్న ఓ మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. హెల్మెట్లు ధరించిన ఇద్దరు అగంతకులు బైక్‌పై అక్కడికి వచ్చారు.గుండి రోడ్డులోని సాయినగర్‌లో అద్దె ఇంట్లో  నివాసం ఉంటున్న అంజలి ని ఇంట్లో నుంచి పిలిచి వాహనాన్ని పార్క్ చేసుకుంటామని చెప్పి మాటల్లో పెట్టారు.బాధిత మహిళ  వెనక్కి తిరిగే క్షణంలో మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని క్షణాల్లోనే బైక్‌పై పరారయ్యారు.ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.