calender_icon.png 19 January, 2026 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాఘ అమావాస్యకు రూ.16.87 లక్షల ఆదాయం

19-01-2026 12:19:37 PM

గతేడాది కంటే ఈసారి రూ.3.74 లక్షలు పెరిగిన ఆదాయం

విజయక్రాంతి,పాపన్నపేట: దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం మాఘ అమావాస్యకు భక్తులు పోటెత్తారు. వేలాదిమంది భక్తజనం మంజీరాలో పుణ్యస్నానం ఆచరించారు. మాఘ అమావాస్య రోజున స్పెషల్ దర్శనం, ఒడి బియ్యం, కేశఖండనం, కుంకుమార్చన, మొక్కుబడి, సత్రము, విరాళాలు, అమ్మవారి ప్రసాదం టికెట్లపై రూ.16,87,215 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. 2025లో రూ.13,13,170 ఆదాయం రాగా, 2026లో రూ.16,87,215 ఆదాయం వచ్చిందని, గతేడాది కంటే ఈసారి రూ.3,74,045 అధికంగా ఆదాయం వచ్చిందని వెల్లడించారు.